Read more!

English | Telugu

సినిమా పేరు:బావ
బ్యానర్:శ్రీ కీర్తి కంబైన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Oct 29, 2010
ఈ చిత్రం సాయికుమార్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది.వీరబాబు(సిద్ధార్థ)ని ఆ ఊరిజనమంతా అస్సాం పంపించేస్తూండగా, వీరబాబుని ఆ ఊరివాళ్ళంతా కన్నీళ్ళతో సాగనంపుతున్నారంటూ సాయికుమార్ చెపుతూండగా ఈ చిత్రం మొదలవుతుంది. విషయమేమిటంటే వీరబాబు అతని గ్యాంగ్ చేసే అల్లరి భరించలేక, పెళ్ళిళ్ళ సీజన్ లో వీరబాబు ఆఊర్లో ఉంటే అప్పుడు జరిగే పెళ్ళిళ్ళు చెడిపోతాయన్న భయంతో,మూణ్ణెళ్ళ ట్రైనింగ్ కోసం అతన్ని ఆ ఊరి వాళ్ళంతా చందాలేసుకుని అతన్ని ఆదర్శరైతు ట్రైనింగ్ కోసమని అస్సాం పంపిస్తూంటారు.కానీ రైలెక్కించగానే అందులోంచి వీరబాబు నాన్న(రాజేంద్రప్రసాద్) కూడా దిగి తిరిగి ఊళ్ళోకి తీసుకెళతాడు. ఇదంతా కోనసీమలోని వెంకటాపురం అనే గ్రామంలో జరుగుతుంది.ఆఊరికి పక్క ఊరికి వచ్చిన సరిహద్దు గొడవల వల్ల రెండు ఊర్ల మధ్య ఉండే రాములవారి దేవాలయంలో రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వెంకటాపురానికి, సీతమ్మ తల్లి ఆ పక్క ఊరికి పంపకాలవుతారు.దీనికి కారణం చెంచురామయ్య(తనికెళ్ళ భరణి)అనే భూస్వామి.అయితే వీరబాబు అనుకోకుండా పక్క ఊరి భూస్వామి అమ్మాయిని ప్రేమిస్తాడు.చివరికి ఆమె వీరబాబుని తన చిన్ననాటి నేస్తంగా గుర్తించి అతన్ని ప్రేమిస్తుంది.అసలు విషయమేమిటంటే ఆ అమ్మాయికి స్వయంగా అతను బావ అవుతాడు.దీనికి పాతికేళ్ళ క్రితం వీరబాబు తండ్రి ఆమె అత్తయ్యను ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు.అప్పటి నుంచీ ఈ రెండుకుటుంబాలకు సంబంధ బాంధవ్యాలు ఉండవు.మరి ఈ బావ తన మరదల్ని ఎలా పెళ్ళి చేసుకున్నాడు...?ఎలా సీతారాముల్ని కలిపాడు అన్నది మిగిలిన క
ఎనాలసిస్ :
దర్శకత్వం - కొత్త దర్శకుడు రాంబాబు టెకింగ్ పరంగా బాగానే జాగ్రత్తపడ్డాడు కానీ, స్క్రీన్ ప్లే విషయంలోనూ, కథనంలోనూ మరింత జాగ్రత్త తీసుకునుంటే ఇంకా బాగుండేది.తన కొడుకు గురించి రాజేంద్రప్రసాద్ ఆహుతి ప్రసాద్ ఇంటికి వెళ్ళి అడిగి దెబ్బలు తిని ఇంటికి వచ్చి మరణించటం వరకూ బాగానే ఉంది.కానీ రమణ పాత్ర హీరోయిన్ని తీసుకెళ్ళిపోవటం,తన ఇంట్లో పెట్టుకుని సైకిల్ పందానికి వీరబాబుని రమణ తండ్రి ఛాలెంజ్ చేయటం, ఆ తర్వాత సైకిల్‍ పందెం ఇవన్నీ సరిగ్గా పండలేదు.అంటే ముందే ఏం జరగబోతోందో ప్రేక్షకులు ఊహించవచ్చు.అది గాక వీరబాబు తన భార్య అని చెపుతున్నా, అక్కడున్నవారందర్నీ రమణ "వాడు తాళికట్టటం నువ్వు చూశావా"అని అడగటం, ఇవన్నీ చూస్తూ కూడా పై నుంచి చూస్తున్న హీరోయిన్ ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉండటం.ఆమె కన్న తండ్రి నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళతానని అనకుండా తన కూతురు గురించి వాళ్ళెవరో పందేలు కాస్తుంటే చేతకానివాడిలా చూస్తూ ఉండటం వంటి తప్పులు సినిమా సెకండ్ హాఫ్ ని దాదాపు చంపేశాయని చెప్పొచ్చు. నటన - ఇక నటన విషయానికొస్తే సిద్ధార్థ పల్లెటురి వాడిగా బాగానే నటించినా తమడ్రి చనిపోయాక ఆహుతి ప్రసాద్ ఇంటికొచ్చి నటించిన సీన్లో అతని నటన మీద, అతని మీద కమల్ హాసన్ ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుంది.ఆ సీన్లో అతను కమల్ హాసన్నే అనుకరించాడని చెప్పొచ్చు.ఇక ప్రణతి తన వరకూ తాను బాగా నటించింది.రాజేంద్ర ప్రసాద్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.బ్రహ్మానందం అయిదు రోజుల పెళ్ళి, ఆలీ పౌరోహిత్యం వంటి సీన్లలో కామెడీ పెద్దగా పండలేదు. సంగీతం - అద్భుతంగా లేకపోయినా చండాలంగా మాత్రం లేదు.పాటల్లో సాహిత్యం బాగానే వినపడుతోంది.పాటలన్నీ యావరేజ్ గా ఉన్నా "నకర నకర" పాట మాస్ కి బాగుంటుంది.రీ-రికార్డింగ్ బాగుంది. మాటలు - సీరియల్ కి ఎక్కువ సినిమాకి తక్కువ అన్నట్లుగా ఉన్నాయి ఈ చిత్రంలోని మాటలు.కొత్త రచయిత మాటలు బాగా రాయటానికి మంచి ప్రయత్నమే చేశాడు. పాటలు - నేటి కాలానుగుణంగా సాహిత్య పరంగా పాటలన్నీ బాగున్నాయి. కెమెరా - ఈ చిత్రంలో కెమెరా వర్క్ బాగుంది.లైటింగ్ స్కీమ్ కూడా సీన్ మూడ్ కి తగ్గట్టుగా బాగుంది. ఎడిటింగ్ - ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ - చాలా బాగుంది. కొరియోగ్రఫీ - కొత్తగా లేకపోయినా చెత్తగా మాత్రం లేదు.ఫరవాలేదనిపించేలా ఈ చిత్రంలోని కొరియోగ్రఫీ ఉంది. యాక్షన్ - పెద్దగా యాక్షన్ సీన్లేమీ లేవు.ఉన్నఒకటి రెండు సీన్లు మాత్రం సహజంగా ఉండేలా జాగ్రత్తపడ్డారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మీకు పల్లెటూరి వాతావరణం చూడాలనుకుంటే,సిద్ధార్థ, ప్రణతిల కోసం ఈ సినిమా చూడాలనుకుంటే, మీకు పనేం లేక బోరుకొడుతూంటే ఈ సినిమా చూడండి.