English | Telugu
3 రాజధానుల పట్ల సొంత పార్టీలోని నేతలు సైతం వ్యతిరేకత!!
Updated : Dec 20, 2019
ఏపీకి 3 రాజధానులు అంటూ జగన్ చేసిన ప్రకటనకు రకరకాల విమర్శలు ఎదురైయ్యాయి.రాజధాని పట్ల పలువురు అనేక రాకాలుగా స్పందిస్తుండగా, ప్రతిపక్షనేతలే కాదు తమ సొంత పార్టీ నేతల సైతం తమ అభిప్రాయాలను వెల్లడించారు. అసెంబ్లీతో పాటు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అమరావతి లోనే ఉండాలని నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. అడ్మినిస్ర్టేషన్ అంతా ఒకే చోట నుంచి చేస్తే బావుంటుందన్న గోపిరెడ్డి ఇదే విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలన్నది తమ ఉద్దేశమని ఎమ్మెల్యే తెలియజేశారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి అన్నది జగన్ ఉద్దేశమని ఆయన అన్నారు. అసెంబ్లీ తో పాటు సెక్రటేరియట్ కూడా ఒకే ప్రాంతంలో ఉండాలనేది తన అభిమతం అని ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒకే చోట నుంచి చేస్తే బాగుంటుందని తన ఆలోచనను వెల్లడించారు. విశాఖపట్నంను ఫైనాన్షియల్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలన్నది కూడా తన అభిప్రాయమని, ఖచ్చితంగా దీన్ని జగన్మోన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ అంశం పై ఆలోచింపజేసి కమిటీ ఆదేశాలు కూడా తెలియజేయాల్సి ఉందని,కమిటీ సలహాలను బట్టి,అందరి సలహాలు సూచనలు తప్పక తీసుకొని దాని అనుగూణంగా నిర్ణయం తీసుకుందామని జగన్ గారు వెల్లడించినట్లు గోపిరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రాంతాలన్ని అభివృద్ధి చెందాలని రాయలసీమ గానీ,ఉత్తరాంధ్ర గానీ, కోస్తాంధ్ర లోని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అనేది తన అభిమతమని ఆయన వెల్లడించారు. ఏదైతే అడ్మినిస్ర్టేటివ్ క్యాపిటల్ ఎత్తు అసెంబ్లీతో పాటు సెక్రటేరియట్ కూడా ఒకే ప్రాంతంలో ఉంటేనే పనులు సులభంగా ఉంటాయని గోపిరెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.మరి ఏపీ సీఎం జగన్ రాజధాని పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.