English | Telugu

భగవద్గీత శ్లోకం ట్వీట్ చేసిన విజయసాయి

కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు..
కానీ వాని ఫలితముల మీద లేదు...
నీవు కర్మఫలములకు కారణం కారాదు...
అట్లని కర్మలను చేయుట మానరాదు ...
విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో తాజా పెట్టిన ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో ఏ5 నిందితుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు విజయసాయి శనివారం (జులై 12) ఈ ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరయ్యారు.

ఇదిలా ఉండగా.. సిట్ నోటీసుల నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ‘కర్మణ్యే వాధికారస్తే’ అంటూ భగవద్గీత శ్లోకాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పడు తెగ వైరల్ అయ్యింది.