English | Telugu
ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ సమావేశం
Updated : Aug 26, 2025
తెలంగాణ కేబినేట్ సమావేశం ఈ నెల 29న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆమోదించనున్నారు. అనంతరం ఆ రిపోర్టును శాసన సభ సమావేశాల తొలి రోజే సభలో ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి.
ఈ నెల 29న మంత్రి వర్గ భేటీలో స్పెషల్ సెషన్‌కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ భేటీలో చర్చించాల్సిన పలు అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అజెండా అంశాలను సాధారణ పరిపాలన విభాగానికికి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణ రావు ఇవాళ సర్క్యూలర్ జారీ చేశారు