English | Telugu
తెలంగాణ క్యాబినెట్ భేటీ వాయిదా
Updated : Jul 25, 2025
తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం (జులై 25)జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని అధికారవర్గాలు తెలియజేశాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఈ కేబినెట్ భేటీ సోమవారం మధ్యాహ్నం జరిగే అవకాశం ఉందని అధికా రవర్గాల సమాచారం.