English | Telugu

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి నదికి వరద కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 14 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదవరి వరద ఉధృతి కారణంగా రాజమహేం ద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద మెట్లు పూర్తిగా నీటమునిగాయి.

ఇక్కడ నీటి మట్టం 55 అడుగులుగా ఉంది. కాగా వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజి 175 గేట్లూ ఎత్తివేసి 13 లక్షల 5 వేల 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ముంపు ముప్పు ఏర్పడింది. అధికారులు లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేశారు. లంకగ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సాయంత్రానికి వరద ఉధృతి ఒకింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.