English | Telugu

పోటెత్తుతున్న సముద్రం.. జలమయమైన మాయపట్నం!

కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరంలో సముద్రం పోటెత్తుతోంది. రాకాసి అలలు చెలియల కట్ట దాటి ఎగసిపడుతున్నాయి. సముద్రం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మాయపట్నం గ్రామం జలమయంమైంది. సముద్రం చొచ్చుకుని రావడంతో మాయపట్నం గ్రామంలో 20 ఇళ్లు ధ్వంసమయ్యాయి.

దాదాపు 70 గృహాలలోకి నీరు చేరింది. సముద్రం ప్రళయభీకరంగా పొటెత్తుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా అధికారులు సముద్రనీటిని వెనక్కు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తీర ప్రాంతంలోని రక్షణ గోడలు, జియో ట్యూబ్ ధ్వంసం కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.