English | Telugu

ఆర్టీసీ సమ్మేకు ప్రత్యామ్నాయ మార్గాల దశగా పయనించనున్న తెలంగాణ ప్రభుత్వం...


ఆర్టీసీ చర్చలు విఫలం కావడంతోటి ఆర్టీసీ సమ్మే మరింత ఉధృక్తం చేయనుంది ఆర్టీసీ జేఏసీ .ఎక్కడి బస్సులను అక్కడే నిలిపిసేందుకు చర్యలు చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నారు ఆర్టీసీ జేఏసీ.దసరా సెలవుల కారణంగా ఊళ్ళుకు వెళ్ళాలనుకున్న ప్రజలు ఎప్పటినుంచో రిజర్వేషన్లు చేయించుకుని ఎంతో ఆనందంగా సెలవులు గడపాలని అనుకున్నరు. కానీ ఈ వార్త విన్న దెగ్గర నుండి ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సు హెవీ లైసెన్స్ కలిగినటువంటి వాళ్లు పధ్ధెనిమిది నెలల అనుభవం ఉన్నటువంటి వాళ్లు వచ్చి డిపో మేనేజర్ కలవాలని పిలుపును ఇవ్వడం జరిగింది. కండెక్టర్ లుగా కావల్సినటువంటి వాళ్లు టెన్త్ మెమో తోటి, ఆధార్ కార్డు తోటి హాజరు కావాలని కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఆర్టీసీ యాజమాన్యం ఆ మేరకు చర్యలు తీసుకుంది.

మరోవైపు హైయర్ బస్సులను రోడ్ల మీద తిప్పేందుకు ప్రయత్నలు కూడా చేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు రిజర్వేషన్ చేసుకున్నటువంటి ప్రయాణికుల్లో భయాందోళన మొదలైయ్యింది. ఆర్టీసీ కార్మిక నేతలు మాత్రం సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. వారు వారి నిర్ణయాన్ని వెన్నక్కు తగ్గే అవకాశమే లేదని వాదనలు వెల్లడవుతున్నయి.వారు కనక డిస్మిస్ అయితే తిరిగి వారిని మళ్ళీ ఎప్పటికి ఉద్యోగాలకు తీసుకునే అవకాశం లేదని టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వం ఖరాకండిగా తెల్చేసింది.దీనికి ప్రత్యమ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ సమ్మే విషయాన్ని అదునుగా భావించిన ప్రైవేటు బస్సులు దీన్ని అవకాశంగా తీసుకొని భారీగా చార్జీలు ఇప్పటి నుంచే వసూలు చేయటం ప్రారంభించారు.