English | Telugu

ప‌వ‌న్ ధ‌రించిన... ఈ ఉంగ‌రంలో ఇంత అర్ధ‌ముందా?

విశాఖ సేన‌తో సేనాని విస్తృత స్థాయి స‌మావేశాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతులు అటు ఇటు ఆడిస్తూ క‌నిపించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న వేలికి ప్ర‌త్యేకించి ఒక ఉంగ‌రం ధ‌రించిన‌ట్టు క‌నిపించింది. ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ర‌క‌ర‌కాల ఉంగ‌రాలు ధ‌రిస్తూ క‌నిపిస్తున్నారు. వాటిలో ప‌గ‌డం.. ఉంగ‌రం ఆపై మేరు కూర్మ‌ ఉంగ‌రం.. ప్ర‌స్తుతం చూస్తే నాగ‌బంధ ఉంగ‌రం క‌నిపించించింది. దీని అర్ధ‌మేంట‌న్న చ‌ర్చ న‌డుస్తోంది.

గ‌తంలో ఆయ‌న కూర్మం ఉండే మేరు ఉంగ‌రం ధ‌రించేవారు. మాములుగా ఇది ఎందుకంటే మేరు ప‌ర్వ‌తాన్ని పాల స‌ముద్రంలో వేసి వాసుకి ద్వారా చిల‌క‌డానికి ప‌నికొస్తుంద‌ని అంటారు. ఆ ప‌ర్వ‌తం మ‌రీ స‌ముద్రంలోప‌ల మునిగి పోకుండా ఆపడానికి పుట్టుకొచ్చిందే కూర్మావ‌తారం. ఆ అవ‌తారం అర్ద‌మేంటంటే ఏదైనా స‌రే మునిగిపోకుండా ఆపేద‌ని అర్ధం. దాని ప్ర‌కారం కూట‌మిలో తానొక కూర్మావ‌తారం దాల్చి ఎలాగోలా గ‌ట్టించ‌గ‌లిగిన పేరు సాధించారు ప‌వ‌న్.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ప్ర‌భుత్వం 15 ఏళ్ల వ‌ర‌కూ ఉండాల్సిందే అంటున్నారు. కార‌ణం.. ఇటు రాజ‌ధాని అమ‌రావ‌తి కానీ, అటు రాష్ట్రం కానీ స్థిర‌ప‌డి అభివృద్ది చెందాలంటే.. ఈ మాత్రం స‌మ‌యం అవ‌స‌రం అన్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆలోచ‌న‌. ఈ విష‌యంపై నేరుగా జ‌న‌సైనికులు నాగబాబునే మొహాన్నే అడిగేసిన ప‌రిస్థితి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా అధినేత తీస్కున్న నిర్ణ‌యాన్ని మ‌నం ఎవ్వ‌రం మార్చ‌లేము అని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేస్తున్నారు నాగ‌బాబు.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ప‌వ‌న్ ధ‌రించిన ఈ నాగ‌బంధ ఉంగ‌రంలో ఒక బంధం ఉంటుంది. రెండు పాములు పెన‌వేసుకున్న దృశ్యం క‌నిపిస్తోంది. ఇది టీడీపీ కూట‌మితో త‌న పార్టీ బంధం ఇలాగే పెన‌వేసుకోవాల‌న్న కోణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలాంటి ఉంగ‌రం ధ‌రించిన‌ట్టుగా భావిస్తున్నారు ప‌లువురు అభిమానులు.