English | Telugu

ఎంపీ మిథున్‌కు సోదరి రాఖీ కట్టడానికి జైలు అధికారులు అభ్యంతరం

రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తన సోదరిరాఖీకట్టడాన్ని జైలు అధికారులు అభ్యంతరం తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్‌ రెడ్డిని ఆయన సోదరి శక్తి రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ కలిసేందుకు వెళ్లారు.

ఈ క్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు తీసుకు వెళుతున్న రాఖీలను జైలు అధికారులు వాటిని వెనక్కి పంపించారు. దీంతో, రాఖీలు లేకుండానే ఆమె ములాఖత్‌కు వెళ్లారు. అనంతరం, ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ..‘జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. చేదు అనుభవాలతో జైలులోకి వెళ్లాల్సి వచ్చింది. రక్షాబంధన్‌ రోజున సోదరితో రాఖీ కట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదని గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.