English | Telugu

అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా : కడియం శ్రీహరి

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. వారిలో ఇద్దరిని మంత్రులను కూడా చేశారు. అప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరిన వారెవరూ రాజీనామా చేయలేదు. ఇప్పుడు ఆ పార్టీ అగ్రనేతలకు విలువలు గుర్తుకొచ్చాయా? సభాపతి నోటీసు ఇచ్చారు, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాను’’ అని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

ఈ ప్రాంత ప్రగతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని విధాలా సహకరిస్తున్నారని తెలిపారు. హనుమకొండలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు గోదావరి జలాలను అందించామని చెప్పారు. చెరువులు నిండిపోయాయని, కాలువల్లో పూడిక తీయించి మరమ్మతులు చేసి సాగునీరు చేరేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యమంత్రి సహకారంతోనే అనేక అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ప్రజలతోనే ఉంటాను, వారి కోసం కృషి చేస్తాను.