English | Telugu
ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క
Updated : Jul 24, 2025
తెలంగాణ మంత్రి సీతక్క ప్రజా ప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు. కోవిడ్ ను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ 2021లో సీతక్క ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేసిన సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా సీతక్క గురువారం (జులై 24) నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లోని ప్రజాప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు.
కోవిడ్ సమయంలో కోవిడ్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించిసీతక్క చేపట్టిన నిరసనకు సంబంధించిన కేసు విచారణకు హాజరైన సీతక్క కోర్టులో పదివేల రూపాయలతో కూడిన రెండు పూచికత్తులను దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.