English | Telugu

అనుమానాస్పద స్థితిలో జర్నలిస్టు మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక ప్రముఖ దినపత్రిలో గత కొన్ని రోజులుగా క్రైమ్ వార్తలు రాస్తున్న మెట్ల కుమార్ గత నెల 23న తన బైక్, ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియలేదు. దీనిపై కుటుంబ సభ్యులు బొమ్మూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.

అప్పటి నుంచీ కనిపించకుండా పోయి మెట్ల కుమార్ గురువారం (జులై 8) ఈస్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో శవంగా కనిపించాడు. మెట్ల కుమార్ కు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి వయస్సు 45 సంవత్సరాలు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని రాజమహేంద్రవరం పోలీసు స్టేషన్ కు తరలించారు. మెట్ల కుమార్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.