English | Telugu

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బెజవాడలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్న అంచనాతో అధికారులు దుర్మమ్మ కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డును మూసివేశారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, భక్తులు సహకరించాలనీ అధికారులు కోరారు. వర్షాలు తెరిపి ఇచ్చి వాతావరణం కుదు టపడిన తరువాత మళ్లీ ఘాట్ రోడ్డుపై వాహనాలను అనుమతిస్తామని తెలిపారు.