English | Telugu

హైదరాబాద్‌లో బేకరీ ఫ్లేవర్స్ కేంద్రం సీజ్

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తపడియా డయాగ్నొస్టిక్స్ బిల్డింగ్‌లో గల రాజ్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రన్సెస్ తయారీ కేంద్రంపై జిహెచ్ఎంసి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేశారు. ఓ ఫ్లోర్‌లో గోదాంలా ఏర్పాటుచేసి, బేకరీ ఉత్పత్తులకు అవసరమైన ఫ్లేవర్స్, ఫ్రాగ్రన్సెస్‌ను అక్కడ తయారు చేస్తున్న నిర్వాహకులు అధిక మోతాదులో రసాయనాలు కలిపి ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అంతేకాకుండా, ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినా పర్మిషన్ లేకుండా ఉత్పత్తులు కొనసాగిస్తున్నట్లు తేలింది. దీని వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలగవచ్చని అధికారులు స్పష్టం చేశారు. చుట్టుపక్కల స్థానికుల ఫిర్యాదుతో ఈ దాడి జరిగినట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించడంతో గోదాంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి బృందం చర్యలు తీసుకుంటున్న సమయంలో నిర్వాహకులు గొడవకు దిగినట్టు తెలిసింది.