English | Telugu
వృద్ధాశ్రమంలో భారీ అగ్నిప్రమాదం.. అమెరికాలో 9 మంది మృతి
Updated : Jul 15, 2025
అమెరికాలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మది మంది మరణించారు. ఈ దుర్ఘటన అమెరికాలోని మసాచుసెట్ లోని ఫాల్ రివర్ గాబ్రియేల్ హౌస్ వృద్ధాశ్రమంలో జరిగింది. ఈ ఘటనలో తొమ్మది మంది ప్రాణాలు కోల్పోయారు.
మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఈ సహాయక చర్యలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది కూడా గాయపడ్డారు.