English | Telugu

జోరందుకుంటున్న మావోయిస్టు సత్సంబంధాలు

మావోయిస్ట్ లతో సంభందాలు ఉన్న నలభై ఐదు మంది పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారిలో పది మంది మావోయిస్టు పార్టీకి చెందిన వారు కాగా, మరో ముప్పై ఐదు మందికి పన్నెండు సంఘాలతో అనుబంధం ఉంది. ఈ సంఘాలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని వారికి ఆయుధాలు సమకూరుస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఉపాధి చట్టం కింద కేసు నమోదైన వారిలో ఇటీవల గద్వాల పోలీసులు అరెస్టు చేసిన తెలంగాణ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి ఉన్నారు. మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా పేర్కొంటూ ఐత అనిల్ కుమార్, దాసరపు సురేష్ ను భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును ఒక పత్రిక సంపాదించింది. అందులో ఉప కేసు నమోదైన నలభై ఐదు మంది వ్యక్తులు పన్నెండు సంస్థల వివరాలున్నాయి. వివరాల్లో తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ పౌర హక్కుల సంఘం, తెలంగాణ విద్యార్థి వేదిక, తుడుం దెబ్బ, చైతన్య మహిళా సంఘం, తెలంగాణ విద్యార్థి సంఘం, ప్రజాస్వామ్య విద్యార్థి వేదిక, తెలంగాణ యూత్ ఫోరం, పార్టియాటిక్ డెమోక్రటిక్ మూమెంట్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, తెలంగాణ రైతాంగ సమితి ఉన్నాయి. ఇవన్నీ మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలని పేర్కొన్నారు. ఆయా సంఘాల నేతలు యూనివర్సిటీలు, కాలేజీల్లో తిరుగుతూ విద్యార్థులను మావోయిజం వైపు ఆకర్షిస్తున్నారని మావోయిస్టులకు నిధులను సేకరించడం ఆయుధాలనూ సాంకేతిక పరికరాలను విప్లవ సాహిత్యాన్ని మందుపాత్రలను సమకూర్చడం వీరి ప్రధాన వీధులని రిమాండ్ రిపోర్టులో చర్ల పోలీసులు వెల్లడించారు.ఈ మావోయిస్టు చర్యలపై వెంటనే ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రాష్ట్రం తీవ్ర నష్టానికి గురి అవుతుందని స్పష్టమవుతోంది.