English | Telugu
రజనీకాంత్ కు చంద్రబాబు అభినందనలు ఎందుకంటే..?
Updated : Aug 16, 2025
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ లో అర్ధ శతాబ్దం పాటు సినీ పరిశ్రమలో అద్భుత కెరీర్ పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
మీ ఐకానిక్ నటనతో లక్షలాది మంది ప్రేక్షకులను అలరించారు. అసంఖ్యాకంగా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, మీ సినిమాల ద్వారా సమాజంలో సామాజిక అవగాహనను పెంచారని చంద్రబబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇలా ఉండగా 50 ఏళ్ల పాటు సూపర్ స్టార్ గా వెలుగొందుతూ అశేష ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న రజనీకాంత్ కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.