English | Telugu

ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియామకం

తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాలకు పదిమంది స్పెషల్ ఆఫీసర్‌లుగా సీనియర్ ఐఏఎస్‌లను ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సి.హరికిరణ్, నల్గొండకు అనిత రామచంద్రన్, హైదరాబాద్ కు ఇలంబర్తి, ఖమ్మం జిల్లాకు కె.సురేంద్ర మోహన్, నిజామాబాద్‌కు హనుమంతు, రంగారెడ్డికి దివ్య, కరీంనగర్‌కు సర్ఫరాజ్ అహ్మద్, మహబూబ్ నగర్ కు రవి, వరంగల్ కు కె. శశాంక, మెదక్ జిల్లాకు ఎ.శరత్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వర్షాకాల పరిస్థితులపై వీరు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం.