English | Telugu

సచివాలయంలో ఊడి పడిన పెచ్చులు

తెలంగాణ సచివాలయంలో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్ వచ్చే మార్గంలో పెచ్చులు ఉడి పడడంతో సచివాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కాగా గత వారం రోజుల నుంచి సచివాలయానికి సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా సచివాలయంలో పెచ్చులు కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సచివాలయ నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. అయితే గతంలో కూడా రెండుసార్లు ఇలా పెచ్చులు ఊడగా... నిర్మాణ సంస్థ చర్యలు చేపట్టింది.