English | Telugu

సురవరం పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. సురవరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు, సుధాకర్ ను చూసి భావోద్వేగానికి గురయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సురవరం పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి సురవరం అని కొనియాడారు. సురవరం లేనిలోటుపూడ్చలేనిదని, ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చంద్రబాబు మాట్లాడుతు దేశం రాష్ట్రానికి తీరని నష్టం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో కలిసి పోరాటం చేశామన్నారు.