English | Telugu

పేదలు, బహుజనుల కోసం పోరాడిన నేత సురవరం : సీఎం రేవంత్

హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి సురవరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేతలు, అభిమానులు సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు సుధాకర్‌రెడ్డి పార్థివ దేహాన్ని మఖ్దూం భవన్‌లో ఉంచనున్నారు. అధికారిక లాంఛనాలు పూర్తయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సుధాకర్‌రెడ్డి రాజీపడని సిద్దాంతలతో రాజకీయాల్లో ఎదిగానని సీఎం రేవంత్ తెలిపారు.విద్యార్థి నేత నుంచి జాతీయ స్థాయి నేతగా ఆయన ఎదిగిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ నేతగా ఎదగడం గర్వకారణమన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సిద్ధాంతాలను ఎప్పుడూ వీడలేదని గుర్తుచేశారు. సుధాకర్‌రెడ్డిని ప్రజలు గుర్తుంచుకునేలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పేరు ఉండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సధాకర్ రెడ్డి లేఖ పేరకే తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టినట్లు తెలిపారు. సురవరం భౌతిక కాయానికి రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సురవరం మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని, ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు కేటీఆర్ తెలిపారు.