English | Telugu
సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థత
Updated : Jul 14, 2025
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఇన్ఫ్‌క్షన్ కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు.
శనివారం ఆయన హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. నాల్సర్ న్యాయ విద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన కోలుకునే అవకాశం ఉన్నట్లు అధికారి తెలిపారు. జూలై 12వ తేదీన సీజేఐ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ టూర్ సమయంలో ఆయన స్పెషల్ పోస్టల్ కవర్‌ను కూడా రిలీజ్ చేశారు.