English | Telugu
ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..చర్యలు తీసుకోవాలని డిమాండ్
Updated : Aug 20, 2025
శ్రీశైలం సమీపంలో శిఖరం చెక్ పోస్ట్ వద్ద నిన్న రాత్రి తమ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేశారని అటవీశాఖ అధికారులు తెలిపారు. నెక్కండి రేంజ్ ఫారెస్ట్ సిబ్బందిని బంధించి తిడుతు కొట్టారని వాపోయారు. మేం చెప్పినట్లు పని చేయట్లేదు అని వాకీటాకీలు, మొబైల్స్, తీసుకున్నారని మీడియాకు వివరించారు. ఈ ఘటనపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తామని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.