English | Telugu
ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం
Updated : Aug 24, 2025
శంషాబాద్ తిరుపతి ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం ఉంది. విమానం మూడు సార్లు రన్‌వే పైకి వెళ్లి తిరిగి వచ్చింది. విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన ఫైలెట్ వెంటనే అధికారులకు సమాచారాన్ని అందించారు.
దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై విమానంలో సాంకేతిక లోపంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నిలిపివేశారు. తిరుపతికి అదే విమానంలో వెళ్లాల్సిన 37 మంది ప్రయాణికులు మూడు సార్లు రన్‌వే పైకి వచ్చిన తిరిగి వెనక్కి వెళ్లిన విమానంపట్ల విసుకు చెందారు. అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.