English | Telugu
రోడ్డు ప్రమాదానికి గురైన కారులో 16 కిలోల గంజాయి లభ్యం
Updated : Aug 16, 2025
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో బాటసింగారం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక కారును పరిశీలించగా, అందులో గంజాయి ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్‌కు చెందిన భూక్యా నాయక్ ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా బాటసింగారం వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో గంజాయి బయటపడిందన్నారు. 16 కేజీల గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూక్యానాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.