English | Telugu

ఏపీ ఉప సభాపతి రఘురామకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లోక్ సభ సభ్యుడిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ బాషాపై దాడి చేశారంటూ గతంలో డిప్యూటీ స్పీకర్ ఆయన కుమారుడు భరత్‌, కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదైంది.

అయితే ఆ కేసును ఇకపై కొనసాగించుకోదల్చుకోలేదని కానిస్టేబుల్‌ బాషా తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ జేకే మహేశ్వరి ధర్మాసనం.. రఘురామ, ఆయన కుమారుడు, సిబ్బందిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2022లో రఘురామరాజు ఇంటి వద్ద కానిస్టేబుల్‌ బాషాపై దాడి జరిగిందని అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.