English | Telugu

ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లాలకే పరిమితం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల అమలులో స్పీడ్ పెంచారు. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచీ అమలు చేయనున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత చంద్రబాబు ఒకదాని వెంట ఒకటిగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేశారు.
అయితే ఈ పథకంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం అమలు అవుతుందనీ, అయితే ఈ పథకంలో ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలు తమ జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చనీ, అయితే జిల్లా దాటితే మాత్రం టికెట్ తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. . అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని క్లారీటీగా చెప్పేశారు. జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు.తెలంగాణలో రేవంత్ సర్కార్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్రం అంతటికీ వర్తింప చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అములులో సాధ్యాసాధ్యలన్నిటినీ అధ్యయనం చేసిన అనంతరం జిల్లాలకు పరిమితం చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఇక పోతే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, పింఛన్లు అందుకునేవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అటువంటి వారి కోసం ఉచిత బస్సు పాసులను ఇవ్వాలని యోచిస్గున్నది. గుండెజబ్బులు, కిడ్నీల సమస్య, పెరాలసిస్, తలసేమియా, లెప్రసీ, వంటి సమస్యలున్నవారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.