English | Telugu

బాలల దినోత్సవం నాడు విషాద వార్త... ఐదేళ్ల బాలుడు మృతి

కర్నూలు జిల్లా పాణ్యంలో విషాదం చోటుచేసుకుంది. విజయానికేతన్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయి పాలానికి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి పాణ్యం విజయనికేతన్ లో యూకేజీ చదువుతున్నాడు.చిన్నారి ప్రమాదవశాత్తు వేడి వేడి సాంబారు గిన్నెలో పడి తీవ్రంగా గాయాల పాలయ్యాడు. హుటాహుటిన అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. బాలుడి మృతదేహాన్ని అక్కడే వదిలేసి స్కూల్ యాజమాన్యం పరారైంది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయాడని ఆరోపించాడు తండ్రి. హాస్టల్లో చేర్పించే సమయంలో రూ.50 వేలు చెల్లించామన్నారు తండ్రి శ్యామ్. ఆ సమయంలో నలుగురు చిన్నారులకు ఒక కేర్ టేకర్ ఉంటారని చెప్పిన స్కూల్ యాజమాన్యం పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు శ్యామ్ సుందర్ రెడ్డి. కర్నూల్ జిల్లాలో జరిగిన తీవ్ర విషాదాం విద్యార్థి తండ్రికి గుండె కోతను మిగిల్చింది.

వడ్డిస్తున్నప్పుడు కిందపడిపోయినట్లు యాజమాన్యం వాళ్ళు తనకు ఫోన్ చేసారని.. అప్పుడు తాను వేరే ఊరిలో ఉన్నానని.. వార్త విన్న వెంటనే స్కూల్ కి వచ్చానని.. అప్పటికే తన బిడ్డ ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నట్లు బాధను వ్యక్తం చేశాడు. స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన ఐదేళ్ళ బిడ్డను తను కోల్పోయానని వాపోయారు. యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి వెల్లడించారు.స్కూళ్లో సరిగ్గా పిల్లల్ని కేర్ తీసుకోవడం లేదని.. సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని.. ఈ విషయంపై చాలా సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్కూల్ యాజమాన్యం సరిగ్గా స్పందించలేదన్నారు. మేము ఫిర్యాదు చేసినప్పుడే స్కూల్ యాజమాన్యం స్పందించి సరైన చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు తన కొడుకు బతికుండేవాడని కన్నీటి పర్వంతం అయ్యారు. రాబోయే రోజుల్లో ఏ ఒక్క తల్లిదండ్రులకు తన కష్టం రాకూడదని..ఎలాంటి నష్టం జరగకూడదని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.