English | Telugu

సెట్‌ని స్వాహా చేసిన ద‌ర్శ‌కుడు..!

పారితోషికం భారీగా అందుకొనే ద‌ర్శ‌కుల‌కు కూడా ఈ కక్కుర్తేమిటో అర్థం కాదు. కోట్లు అందుకొంటూనే చిల్ల‌ర మ‌ల్ల‌ర క‌మీష‌న్ల వైపు ఆశ‌గా చూస్తుంటారు. టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ ద‌ర్శ‌కుడి ప‌రిస్థితీ అంతేన‌ట‌. ఇటీవ‌లే ఓ స్టార్ హీరోతో సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇచ్చిన ఓ ద‌ర్శ‌కుడు, ఇప్పుడు మ‌రో స్టార్ హీరోతో ఓ సినిమా చేస్తున్నాడు. మ‌నోడికి ప్రొడ‌క్ష‌న్ కిటుకులూ తెలుసు.. అన్న న‌మ్మ‌కంతో స‌ద‌రు నిర్మాణ సంస్థ‌.. ఈ ద‌ర్శ‌కుడ్ని ప్రొడ‌క్ష‌న్ కూడా చూసుకోమ‌ని పుర‌మాయించింది. అదే అదునుగా తీసుకొని... ఈ ద‌ర్శ‌కుడు రెచ్చిపోతున్నాడ‌ట‌. రూపాయి ఖ‌ర్చు చేసి నాలుగు రూపాయ‌లు బ‌డ్జెట్లో రాస్తున్నాడ‌ట‌. దాంతో స‌ర‌దు సినిమా బ‌డ్జెట్ ఇప్ప‌టికే మించిపోయింద‌ని నిర్మాత‌లు నానా హైరానా ప‌డుతున్నారు. అంతేకాదు... ఈమ‌ధ్య ఈ సినిమా కోసం సార‌ధి స్టూడియోలో పెద్ద సెట్ వేశార‌ట‌. సెట్ వ్య‌యం కోటి రూపాయ‌లు అయితే.. దాన్ని తిమ్మిని బ‌మ్మి చేసి నాలుగు కోట్ల లెక్క తేల్చాడ‌ట‌. అంటే మిగిలిన మూడు కోట్లూ.. మనోడి ఎకౌంట్‌లోకి వెళ్లిపోయిన‌ట్టే క‌దా?? ఈ విష‌యం ఆ నిర్మాణ సంస్థ‌కూ తెలిసింది. విష‌యం ఏమిట‌ని నిల‌దీసింది కూడా. దాంతో ఆ ద‌ర్శ‌కుడికీ, నిర్మాణ సంస్థ‌కూ గొడ‌వ‌లు మొద‌లైన‌ట్టు టాక్‌. పెద్ద సినిమా సినిమా.. బ‌యట ప‌డితే అల్ల‌రి పాలైపోతామేమో అని... నిర్మాత‌లు కామ్‌గా ఉండిపోయార‌ట‌. సినిమా విడుద‌లై.. రిజ‌ల్ట్ తేలిపోతే త‌ప్ప ఈ గొడ‌వ‌లేం బ‌య‌ట‌కు రావు. ఇలాంటి ద‌ర్శ‌కులు త‌యార‌వ్వ‌డం బ‌ట్టే.. టాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంది.