English | Telugu

బాలయ్యతో సోనాక్షి సిన్హా!

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తదుపరి సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్యకు కూతురి పాత్రలో శ్రీలీల కనిపిస్తుందని గతంలో అనిల్ చెప్పాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.

 

'దబాంగ్'(2010) సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఇటీవల 'వాల్తేరు వీరయ్య'(మెగా 154)లో చిరంజీవి సరసన నటించనుందని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ లోకి శృతి హాసన్ ఎంట్రీ ఇచ్చింది. అయితే చిరు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేకపోయిన సోనాక్షి.. బాలయ్య సినిమాతో ఇవ్వనున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.