English | Telugu

శృతీ లెక్చర్ గౌతమీ గురించేనా..?

కమల్‌హాసన్-గౌతమీల బ్రేకప్‌ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది..ఎవరు ఎంతగా విమర్శించినా కలిసే ఉన్న ఈ జంట అర్థాంతరంగా విడిపోవడం కొందరిని బాధించింది. అటు కమల్-గౌతమీలు విడిపోవడానికి కారణం శృతీహాసనే అనే వాదనలు వినిపించాయి. ఈ సంగతి పక్కనబెడితే తాజాగా "రిలేషన్‌షిప్స్‌" గురించి శృతీహాసన్ పెద్ద లెక్చర్ ఇచ్చింది. కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తమే..ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే జీవితం బాగుంటుంది. ముఖ్యంగా రిలేషన్స్‌ విషయంలో రాజీ పడాల్సిందే..

ఒకప్పుడు స్నేహంలో అయినా..వివాహ బంధంలో అయినా రాజీ పడేవారు అందుకే ఆ బంధాలు బలంగా ఉండేవి. ఇప్పుడు రాజీపడటం తగ్గింది కాబట్టి..విడిపోవడాలు ఎక్కువైపోయాయి. ఈజీగా లవ్‌లో పడటం..అంతే సులువుగా విడిపోవడం..ఇష్టపడి పెళ్లాడటం..చిన్న చిన్న వాటికే విడిపోవడం వల్ల బంధాలకు విలువ లేకుండాపోతోంది అంటూ చెప్పింది శృతీ. అసలు ఎప్పుడు లేనిది శృతీహాసన్ బంధాల గురించి మాట్లాడటం ఏమిటి..? అది కూడా కమల్-గౌతమీ విడిపోయిన తర్వాత మాట్లాడటంతో కోలీవుడ్‌లో ఇది చర్చనీయాంశమైంది.