English | Telugu

కోడుకు కోరికమీదట సినిమాలకు గుడ్ బై చెబుతున్న సమంత..?

ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకోవ‌డం చాలా క‌ష్టం. దానిని నిల‌బెట్టుకోవ‌డం మ‌రింత క‌ష్టం. అయితే అలాంటి హోదాను కొన్నేళ్ళ నుంచి ఎంజాయ్ చేస్తోంది స‌మంత కెరీర్ ప‌రంగా బెస్ట్ స్టేజ్ లో ఉంద‌నే చెప్పాలి. ప్రస్తుతం ఈ అందాల సుందరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్‘ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఓ సందర్భంలో సమంత మాట్లాడుతూ... ప్ర‌స్తుతం త‌న వ‌య‌సు 29 సంవ‌త్స‌రాల‌ని.. ఇక పెళ్లి చేసుకోవ‌డం బెట‌ర్ అనుకుంటున్నా అంటూ చెప్పగానే పుకార్లు షికారు చేసాయి . అక్కినేని నాగచైతన్యతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని , అటు సమంత ఫ్యామిలీ, ఇటు నాగచైతన్య ఫ్యామిలీ వీరి లవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అతి తర్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు ఈ జంట అంటూ టాలివుడ్ కోడై కూసింది. ఇంకా ఆ చర్చ ఓ కొలిక్కి రాకుండానే ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది . సమంత పెళ్ళి తర్వాత సినిమాలలో నటించకూడదని నాగ్ కండీషన్ పెట్టాడట . అందుకు సమంత కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.