English | Telugu
కత్రినాను ఏడిపించిన సల్మాన్!
Updated : Jun 16, 2015
కత్రినా మాటెద్దని సల్మాన్ ఖాన్ షాకిచ్చాడట. సల్మాన్ తో లవ్ బ్రేకప్ చేసుకున్న కత్రినా రణబీర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనుంది కూడా. ఇంతలో భాయ్ తో ఓ కమర్షియల్ యాడ్ లో నటించే ఛాన్స్ వచ్చిందట. కెరీర్ ఇచ్చిన సల్మాన్ తో అనగానే సరే అందట. కానీ భాయ్ మాత్రం కత్రినాతోనా.....నో వే అన్నాడట. దీంతో మాజీ లవర్ పై సల్మాన్ కోపంగా ఉన్నాడని మీడియా తెగ హడావుడి చేసింది. కత్రినా కూడా కన్నీళ్లు పెట్టుకుందట. కారణం ఏంటా అని ఆరాతీస్తే....అసలు విషయం తెలిసింది.
ప్రస్తుతం రణబీర్ తో పెళ్లిపీటలెక్కేందుకు కత్రినా రెఢీగా ఉంది. ఇలాంటి టైమ్ లో తనతో యాడ్ లో నటిస్తే పాతబంధం మళ్లీ చిగురించిందా....వగైరా..వగైరా అంటూ మళ్లీ హడావుడి మొదలవుతుందని...అదేమాత్రం తమ మాజీ ప్రియురాలికి మంచిదికాదని ఆలోచించాడట. అందుకే తనతో యాడ్ లో నటించేందుకు వేరే భామని సంప్రదించమన్నాడట. ఈ మాట విన్న కత్రినా ఆనందంతో కన్నీళ్లుపెట్టుకుందట. బీ టౌన్ జనాలు మాత్రం భాయ్ గ్రేట్ అంటున్నారు. గతంలో తాను వర్జిన్ అంటూ మాజీ ప్రియురాళ్లందర్నీ గట్టున పడేసిన సంగతి గుర్తుచేసుకుంటున్నారంతా.