English | Telugu

చ‌ర‌ణ్‌ని కాపీ కొడుతున్న ఎన్టీఆర్‌

సినిమాల్ని పోలిన సినిమాలు ఎన్నో. అరె.. ఈ క‌థ మొన్నోచ్చిన హిట్ సినిమాలోనిది క‌దా..? అంటూ ప్రేక్ష‌కులు ముక్కున వేలేసుకోవ‌డం మామూలే! తాజాగా రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ సినిమాల క‌థ‌లు మ్యాచ్ అవుతున్న‌ట్టు టాలీవుడ్‌లో గుస‌గుస‌లాడుకొంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్ - కృష్ణ‌వంశీ క‌ల‌యిక‌లో గోవిందుడు అంద‌రివాడేలే సినిమా వ‌చ్చింది. అందులో హీరో ఫారెన్‌లో సెటిల‌వుతాడు. అయితే త‌న‌కో కుటుంబం ఉంద‌ని, బంధాలూ, అనుబంధాలు అక్క‌డే ఉన్నాయ‌ని తెలుసుకొని.... ఇండియా కొస్తాడు. అక్క‌డ తాత‌య్య‌ ఇంట్లో త‌న పేరు చెప్పుకోకుండా స్థానం సంపాదిస్తాడు. వారిలో మార్పు తీసుకొస్తాడు. ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రేమ‌తో నాన్న‌కు అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమా కథ కూడా అంతేన‌ట‌. ఎన్టీఆర్ లండ‌న్‌లో పుట్టి పెరిగిన ప్ర‌వాసాంధ్రుడు. త‌న మూలాలు తెలుగు గ‌డ్డ‌పై ఉన్నాయ‌ని తెలుసుకొంటాడు. త‌న నాన్న కోసం ప‌ల్నాడు వ‌స్తాడు. ఫ్లాష్ బ్యాక్‌లో త‌న నాన్న‌పై జ‌రిగిన కుట్ర‌కు ఇక్క‌డ ప్ర‌తీకారం తీర్చుకొంటాడు. అదీ.. తాత‌య్య ఇంట్లో. అదీ క‌థ‌. చూస్తుంటే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ సినిమాల క‌థలు ఒకేలా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి... టేకింగ్ లో సుకుమార్ ఎంత వైవిధ్యం చూపిస్తాడో మ‌రి..?