English | Telugu

ఆ హీరోయిన్ ప్ర‌భాస్‌ని తిట్టిందా?

ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించిన హీరోయిన్ల‌ను ఎవ‌రినైనా అడ‌గండి.. ప్ర‌భాస్ అంటే ఏమిటో చెబుతారు. అత‌నో జెంటిట్‌మెన్ అని కొంద‌రు, హీమాన్ అని కొంద‌రు, సైలెంట్ అని కొంద‌రు ఇలా స‌ర్టిఫికెట్ల మీద స‌ర్టిఫికెట్లు ఇచ్చేస్తుంటారు. ప్ర‌భాస్ ఆతిథ్యం అద్భుత‌మ‌ని కితాబులు అందిస్తుంటారు. ఇవ‌న్నీ నిజాలే! ప్ర‌భాస్ కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరంగా ఉంటాడు. అందుకే ప్ర‌భాస్‌పై ఎలాంటి కంప్లైంట్లూ లేవు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ప్ర‌భాస్ పై నెగిటీవ్ ప్ర‌చారం చేస్తోంది. అంతేకాదు... ప్ర‌భాస్‌కి సెట్లో చుక్క‌లు చూపించేసింద‌ట‌.

ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. కంగ‌నా రనౌత్‌. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని, నేష‌న‌ల్ అవార్డులు కూడా గెలుచుకొన్న కంగ‌నా టాలీవుడ్‌లో చేసింది ఒకే ఒక్క సినిమా. అదే... ఏక్ నిరంజ‌న్‌. ఆ త‌ర‌వాత ఇక తెలుగులో సినిమాలు చేయ‌ను అంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈమ‌ధ్య హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు కూడా ఏక్ నిరంజ‌న్ సెట్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్ని గుర్తు చేసుకొంది కంగ‌నా. సెట్లో ప్ర‌భాస్‌కీ త‌న‌కూ ప‌డేది కాద‌ని, ఇద్ద‌రూ చాలా రోజులు మాట్లాడుకోలేద‌ని చెప్పేసింది. అంత‌గా ప్ర‌భాస్‌కీ - కంగనాకీ గొడ‌వ ఏం జ‌రిగి ఉంటుంద‌బ్బా?? అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు తెలుగు సినీ జ‌నాలు.

సెట్‌కి ఏనాడూ చెప్పిన టైమ్ కి రాలేద‌ట కంగ‌నా. త‌న కోసం టీమ్ టీమ్ అంతా గంట‌ల త‌ర‌బ‌డి ఎదురుచూడాల్సివ‌చ్చేద‌ట‌. అదేంట‌ని అడిగితే.. `మా బాలీవుడ్‌లో ఇంతే.. ` అంటూ వంక‌ర‌గా స‌మాధానాలు చెప్పేద‌ట‌. ఇదంతా చూస్తూ చూస్తూ ఉండ‌లేక‌.. ఓరోజు కంగ‌న‌కి లైఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడ‌ట ప్ర‌భాస్‌. ఆ రోజు కంగ‌నా కూడా ప్ర‌భాస్ ని తిట్టేసింద‌ట‌. డీసెన్సీ లేద‌ని, ఆడ‌వాళ్ల‌తో మాట్లాడే తీరు ఇదేనా?? అంటూ అరిచేసింద‌ట‌. అప్ప‌టి నుంచీ ప్ర‌భాస్‌కీ, కంగ‌నాకు మాట‌ల్లేవ‌ని, అలానే సినిమా షూటింగ్ ముగించేశార‌ని టాక్ వినిపిస్తుంది. మ‌రి అదెంత నిజ‌మో తెలియాలంటే ఏక్ నిరంజ‌న్ టీమ్ లో ఒక్క‌రైనా నోరు మెద‌పాల్సిందే.