English | Telugu

ఫ్లాష్‌.. ఫ్లాష్... ప్ర‌భాస్ ల‌వ్ మ్యారేజ్‌??


ప్ర‌భాస్ పెళ్లెప్పుడు?? - ప్ర‌స్తుతం ప్ర‌భాస్ అభిమానుల మ‌దిలో మెదిలే ప్ర‌శ్న ఇది. 2015లో ఎట్టిప‌రిస్థితుల్లోనూ పెళ్లి చేసుకొంటాన‌ని ప్ర‌భాస్ చెప్పాడు. కానీ 2016 వ‌చ్చేసింది. ఇప్ప‌టికీ పెళ్లిమాటెత్తితే... 'చూద్దామండీ' అంటూ స‌మాధానం దాటేస్తున్నాడు. ప్ర‌భాస్ పెళ్లిపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు.. వీటిపై ఏ ఒక్క‌రిలోనూ క్లారిటీ లేదు. అయితే ప్ర‌భాస్ పెళ్లి సీక్రెట్‌ని మీడియాతో పంచుకొన్నారు రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు. ''2016లో ప్ర‌భాస్ పెళ్లి ఖాయం..'' అంటున్నారాయ‌న‌. ''మొన్న సంక్రాంతి పండ‌క్కి ప్ర‌భాస్ ద‌గ్గ‌ర మాట తీసుకొన్నా.

ఈ యేడాది ఎలాగైనా పెళ్లి చేసుకొంటా అన్నాడు. బాహుబ‌లి 2 షూటింగ్ అయినా, అవ్వ‌క‌పోయినా.. ఈ యేడాదే త‌న పెళ్లి చేసేస్తాం. ప్రేమ వివాహ‌మా, పెద్ద‌ల కుదిర్చిన వివాహ‌మా అన్న‌ది మాత్రం నేనిప్పుడే చెప్ప‌లేను. మేమంతా.. అరెంజ్డ్ మ్యారేజ్ చేద్దామ‌నుకొంటున్నాం. మ‌రి పెళ్లి చేసుకొనేది వాడు క‌దా. త‌న మ‌న‌సులో ఏముందో'' అంటున్నారు. అంటే.. ప్ర‌భాస్‌కి ప్రేమ పెళ్లి చేసుకొనే ఆలోచ‌న ఉందా? అనే అనుమాలు మొద‌ల‌య్యాయి. అవునో కాదో ఇంకొన్నాళ్లు ఆగితే తేలిపోతుంది. మొత్తానికి ఈ యేడాది ప్ర‌భాస్ ని పెళ్లి కొడుకుగా చూడ‌డం ఖాయ‌మే.