English | Telugu

ప‌వ‌న్ కి `డ‌మ్మీ`లే కావాలా?!

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఓ ప్ర‌భంజ‌నం! ప‌వ‌న్ పిలుపు కోసం అగ్ర ద‌ర్శ‌కులు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తుంటారు. కానీ.. ఆయ‌న చూపెప్పుడూ కొత్త ద‌ర్శ‌కుల‌పై ఉంటుంది. సినిమాలు తీసిన అనుభ‌వం లేకున్నా, హిట్లు రాకున్నా, టాలెంట్ అంతంత మాత్ర‌మే అని తెలిసినా కూడా పిలిచి మ‌రీ... సినిమా చాన్సిలిస్తాడు. ఓ.. క‌రుణాక‌ర‌ణ్‌, ఓ ఎస్‌.జె సూర్య‌, ఓ.. వీర శంక‌ర్‌... మొన్న‌టికి మొన్న బాబి.. !

ఇలా ప‌వ‌న్ ఎప్పుడు ఓ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తాడో తెలీదు. ఇప్పుడు సంతోష్ శ్రీ‌న్‌వాస్‌ని పిలిచి మ‌రీ వేదాళం రీమేక్‌ని అప్ప‌గించాడు. ఈ నిర్ణ‌యం ప‌వ‌న్ అభిమానుల‌కు సైతం షాక్‌కి గురి చేసింది. శ్రీ‌న్‌వాస్ చేసింది రెండే సినిమాలు. అందులో కందిరీగ యావ‌రేజ్‌గా ఆడింది. ర‌భ‌స ఫ్లాప్‌. రీమేక్ సినిమాలు భుజాన వేసుకొన్న అనుభ‌వం కూడా లేదాయె. ర‌భ‌స త‌ర‌వాత ఈ ద‌ర్శ‌కుడ్ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు కూడా. అలాంటిది స‌డ‌న్‌గా రేసులోకి వ‌చ్చేశాడు. వేదాళం రీమేక్‌ని ఈ యంగ్ డైరెక్ట‌ర్ చేతిలో పెట్టేశాడు ప‌వ‌న్‌. మ‌రోవైపు డాలీ, ఎస్‌.జె.సూర్య‌, జానీ మాస్ట‌ర్.. ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌ని ఎగ‌బ‌డుతున్న త‌రుణంలో... ప‌వ‌న్ ఇలాంటి స్టెప్ తీసుకోవ‌డం షాకే క‌దా? అయితే ప‌వ‌న్ ఎక్కువ‌గా డ‌మ్మీ ద‌ర్శ‌కుల్నే తీసుకొంటాడ‌ని, వాళ్ల‌ని అడ్డుపెట్టుకొని తాను డైరెక్ష‌న్ చేసేస్తాడ‌ని, అందుకే ఇలాంటి షాకులు కామ‌న్ అని ఇండ్ర‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి

హిట్టొస్తే.. అది ప‌వ‌న్ ఖాతాలోకి వెళ్తుంది. ఫ్లాప‌యితే.. `ప‌వ‌న్ ని స‌రిగా హ్యాండిల్ చేయ‌లేక‌పోయాడు` అని ద‌ర్శ‌కుల్ని ఆడిపోసుకొంటారు. ప‌వ‌న్ స్ట్రాట‌జీ అచ్చంగా ఇదేనేమో?