English | Telugu

ఆయ‌న క‌నిపిస్తే.. ప‌వ‌న్ పారిపోతున్నాడు

దేవిశ్రీ ప్ర‌సాద్‌కి ఓ అల‌వాటుంది. తన ఆల్బ‌మ్‌లో ఒక్క పాటైనా స్టార్ హీరోతో పాడిస్తుంటాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో అత్తారింటికి దారేదిలో కాట‌మ రాయుడా అనే పాట పాడించాడు. ఆ సాంగ్ సూప‌ర్ హిట్ట‌య్యింది. యూ ట్యూబ్‌లో ల‌క్ష‌ల హిట్స్ త‌న ఖాతాలో వేసుకొంది. తాజాగా స‌ర్దార్ - గ‌బ్బ‌ర్ సింగ్‌లోనూ ప‌వ‌న్‌తో ఓ పాట పాడించాల‌ని ఫిక్స‌య్యాడు. అయితే ప‌వ‌న్ మాత్రం ''పాటంటే ఇప్పుడు క‌ష్టంలే.. ఆల్రెడీ ఓసారి పాడించేశావ్ క‌దా'' అన్నాడ‌ట‌. కానీ దేవిశ్రీ ప్ర‌సాద్ మాత్రం పాట పాడాల్సిందే అని టార్చ‌ర్ పెడుతున్నాడ‌ట‌.

గ‌బ్బ‌ర్ సింగ్ సెట్స్‌కి కూడా వెళ్లి.. ప‌వ‌న్‌ని ప‌దే ప‌దే బ‌తిమాలుతున్నాడ‌ని టాక్‌. దాంతో దేవిశ్రీ క‌నిపిస్తే ప‌వ‌న్ పారితోతున్నాడ‌ట‌. ''ఆ పాట గురించి త‌ప్ప ఏదైనా మాట్లాడు'' అంటున్నాడ‌ట‌. దాంతో దేవి మ‌న‌సు కూడా నొచ్చుకొంటుంద‌ట‌. చివ‌రికి... ''పాట పాడ‌మంటే పాడ‌తా.. కానీ షూట్ చేయొద్దు'' అంటూ ప‌వ‌న్ కండీష‌న్ పెట్టాడ‌ట‌.

అప్ప‌టికి గానీ దేవి ప‌వ‌న్‌ని వ‌ద‌ల్లేద‌ని తెలిసింది. పాట పాడేందుకు ఒప్పుకొన్నాడు క‌దా, ఏదోలా షూటింగ్‌కి ఒప్పుకొంటాడ‌న్న‌ది దేవి ప్లాన్‌. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.