English | Telugu

ప‌వ‌న్ సిగ్గొదిలేశాడు

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే అభిమానుల‌కు పండ‌గే. ఫైటింగులు అద‌ర‌హో.. డైలాగులు సూప‌ర్బ్‌. చిన్న చిన్న స్టెప్పుల‌తోనే మెస్మ‌రైజ్ చేస్తుంటాడు. అయితే రొమాన్స్ విష‌యంలో ప‌వ‌న్ వీకే. క‌థానాయిక‌ల‌తో ముద్దు సన్నివేశాల‌న్నా, రొమాంటిక్ సీన్స్ అన్నా.. సిగ్గుతో ముడుచుకుపోతాడు. అయితే స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌లో మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఈ సినిమాలో ప‌వ‌న్ - కాజ‌ల్‌ల రొమాన్స్ భారీ లెవిల్లో వ‌ర్క‌వుట్ అవుతోంద‌ట‌.

స‌ర్దార్ కోసం ప‌వ‌న్ - కాజ‌ల్‌ల మధ్య ఓ రొమాంటిక్ పాట ఇటీవ‌ల గుజ‌రాత్‌లో తెర‌కెక్కించారు. ఆ పాట‌లో ప‌వ‌న్ రెచ్చిపోయిన‌ట్టు టాక్‌. త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ లేనంత రొమాన్స్ చూపించాడ‌ట‌.కాజ‌ల్ కూడా ప‌వ‌న్ తో ఈ పాట‌లో అల్లుకుపోయిన‌ట్టు తెలుస్తోంది. దేవిశ్రీ ఇచ్చిన మెలోడీ గీతాన్ని బాబి ఓ కొత్త పంథాలో తెర‌కెక్కించాడ‌ట‌, ప‌వ‌న్ - కాజ‌ల్‌లు ఇద్ద‌రూ ఈ పాట‌లో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన‌ట్టు టాక్‌, ప‌వ‌న్ కూడా ఈ పాట అవుట్ పుట్ చూసి... తెగ సంతోష‌ప‌డిపోతున్నాడ‌ట‌. 'ఇంత రొమాన్స్ నాకెక్క‌డ వ‌చ్చింది' అంటూ. త‌న‌కు తానే షాకైపోయిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి.. ప‌వ‌న్ రొమాన్స్ విష‌యంలో సిగ్గొదిలేశాడ‌న్న‌మాట‌.