English | Telugu

ప‌వ‌న్ కి ఆమెపై అంత ఇంట్ర‌స్ట్ ఎందుక‌ట‌..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ లో టాలెంటుల‌కు కొద‌వ లేదు. ప‌రిశ్ర‌మ‌కు బ్లాక్ బ్ల‌స్ట‌ర్ సినిమాలు అందించిన స్టార్ హీరోలో... అనేక క‌ళ‌లున్న సంగ‌తి పవ‌న్ అభిమానుల‌కు ప‌రిచ‌యం చేయ‌క్క‌ర్లెద్దు. ద‌ర్శ‌క‌త్వం, గానం, కొరియోగ్ర‌ఫీ... ఇలా అన్ని విభాగాల‌తోనూ ప‌రిచయం ఉంది. కావాలంటే ఫైట్లూ కంపోజ్ చేస్తాడు. ఇప్పుడు ట్రైనీ అవ‌తారం ఎత్తాడు. ఓ హీరోయిన్ కి ద‌గ్గ‌రుండి మ‌రీ యాక్టింగ్‌లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడ‌ట‌. ఆ హీరోయిన్ ఇంకెవ‌రో కాదు.. గ‌బ్బ‌ర్ సింగ్ 2 హీరోయిన్ అనిషా ఆంబ్రోస్‌. అలియాస్ జాన‌కి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అనిషా. గోపాల గోపాల‌లో చిన్న పాత్ర‌లో మెరిసింది. చూడ్డానికిఅమ్మ‌డు పెద్ద అంద‌గ‌త్తేం కాదు. మాగొప్ప యాక్ట‌రూ కాదు. కానీ.. ప‌వ‌న్ స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ తో అంబ్రోస్‌కి శిక్ష‌ణ ఇప్పిస్తున్నాడు. ఈ అమ్మాయినే ఎంపిక చేయాల‌ని ప‌వ‌న్ ముందే ఆదేశాలిచ్చాడ‌ట‌. ఇండ్ర‌స్ట్రీలో ఇంత మంది హేమాహేమీలైన క‌థానాయిక‌లుండ‌గా అనీషాపైనే ప‌వ‌న్ ఎందుకు గురిపెట్టాడో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు. త‌న ఎంపిక‌ను ఎవ్వ‌రూ వేలెట్టి చూపించ‌కూడ‌ద‌ని అనుకున్నాడేమో.. ఇప్పుడు ఆమెకు ట్రైనింగ్ ఇస్తూ బిజీగా ఉన్నాడు. మ‌రి ఈ జంట తెర‌పై రొమాన్స్‌ని ఎంత ర‌క్తిక‌ట్టిస్తారో చూడాలి.