English | Telugu

నారా రోహిత్ 'అప్పట్లో ఒకడుండేవాడు'

'రౌడీ ఫెలో' తో యాక్షన్ హీరోగా తన కమర్షియల్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నాడు నారా రోహిత్. తాజాగా, నారా రోహిత్‌ 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'ప్రేమ...ఇష్క్..కాదల్' చిత్రంలో 'రాయల్‌రాజు' గా తన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించిన శ్రీ విష్ణు ఈ చిత్రంలో మరో హీరోగా నటిస్తున్నాడు. 'అయ్యారే' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాగర్‌.కె. చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. 1992-1996 సంవత్సరాల మధ్య ఇద్దరు యువకుల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను వశిష్ట మూవీస్ బ్యానర్‌పై నూతన నిర్మాతలు హరి, సన్నీరాజు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్‌ మొదటివారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.