English | Telugu

సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ ఇకలేరు

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ చెన్నైలో మల్లార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఎం.యస్.విశ్వనాథన్ కేరళలో పాలక్కడ్ కు చెందిన ఇలప్పుళి గ్రామంలో 1928, జూన్ 24న జన్మించారు. మొత్తం 1200 చిత్రాలకు సంగీతం అందించిన ఆయన తెలుగులో కేవలం 31 సినిమాలకు మాత్రమే సంగీతం అందించారు.

తెనాలి రామకృష్ణ, ఆకలి రాజ్యం, మరో చరిత్ర, అంతులేని కధ, అందమయిన అనుభవం, చిలకమ్మా చెప్పింది, ఇది కధ కాదు,గుప్పెడు మనసు, కోకిలమ్మ వంటి సినిమాలకు అందించిన అపూర్వమయిన బాణీలతో తెలుగు సినీ సంగీతం ప్రపంచంలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. ఫిలిం ఫేర్ జీవిత కాల పురస్కారం(2001), పరమాచార్య అవార్డు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమయిన కలైమణి అవార్డు వంటి అనేక అవార్డులు ఆయన అందుకొన్నారు.