English | Telugu

కీర్తికి అంత సీనుందా..?

నేను శైలజతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్‌ వన్‌ బై వన్ ఆఫర్లు ఎగరేసుకుపోతోంది. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్‌లో కూడా ఈ అమ్మడి కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. అలా చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌ కేటగిరీలో ప్లేస్ కన్ఫర్మ్ చేసేసుకుంది. ఇదిలా ఉంటే వెండితెర సామ్రాజ్ఞి, మహానటి సావిత్రి బయోపిక్‌ను తీసేందుకు ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. సావిత్రి పాత్ర కోసం...నిత్యమీనన్, నయనతార, అనుష్క, సమంత ఇలాచాలా మంది హీరోయిన్ల పేరు తెరమీదకు వచ్చాయి. కానీ ఏ వార్తలోనూ నిజం లేదని తేలింది.

ఇప్పుడు రీసెంట్‌గా కీర్తి సురేష్ పేరు బయటకు వచ్చింది..ఎంతలా అంటే కీర్తి ఇక ఫైనల్ అన్నంతగా..ఇదంతా పక్కన బెడితే అసలు సావిత్రి పాత్రకు కీర్తిని ఏం చూసి ఎంపిక చేశారా.? అని..హీరోయిన్‌గా పట్టుమని పది సినిమాలు కూడా కంప్లీట్ చేయలేదు..అందం వరకు ఓకే గానీ..నటిగా స్కోప్ ఉన్న పాత్రలేవి చేయలేదు..అలాంటి అమ్మాయిని సావిత్రి పాత్రకు ఎలా తీసుకుంటారు..? తెలుగుజాతి మరువలేని నటి సావిత్రి..ఆమె చేసిన ప్రతి పాత్ర ఒక గ్రంథాలయం..ఎన్ని తరాలు మారినా ఆమె జీవించిన చిత్రాలు ప్రేక్షకుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి..