English | Telugu

మెగా ఫ్యామిలీలో మల్టీస్టారర్..?

ఖైదీ నెం.150 తర్వాత చిరు నెక్ట్స్ మూవీ ఏంటా అని ఇండస్ట్రీతో పాటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్‌తో సినిమా చేసేందుకు సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను రెడీగా ఉన్నారు. కానీ చిరు వారిని రిజర్వ్‌లో పెట్టాడే కానీ అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. అయితే చిరంజీవి, చెర్రీలతో ఓ మల్టీస్టారర్‌ని పట్టాలెక్కించేందుకు చర్చలు జరుగుతున్నాయట..ఇప్పటికే వీరిద్దరూ చాలా కథలు విన్నారట. మెగా కాంపౌండ్‌లో దీనిపై సీరియస్‌గా చర్చలు జరుగుతున్నాయట..గతంలో తండ్రి కొడుకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను అలరించారు..కాసేపు కనిపిస్తేనే ధియేటర్లన్ని షేక్ అయ్యాయి..ఇక సినిమా మొత్తం వీరిద్దరూ కనిపిస్తే..అన్ని అనుకున్నట్లు జరిగితే మెగా అభిమానులకు పండుగే..కానీ ఈ విషయంలో వాస్తవమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.