English | Telugu

కాటమరాయుడు టీజర్‌పై బన్నీ ఎందుకు స్పందించలేదు..?

పవన్ కళ్యాణ్‌ని దగ్గర చేసుకునేందుకు మెగా ఫ్యామిలీ ఏ సందర్భాన్ని వదిలిపెట్టడం లేదు..ఫ్యామిలీ కార్యక్రమం కావొచ్చు..సినిమా ఫంక్షన్ కావొచ్చు...సందర్భం ఏదైనా పవన్‌‌ని ప్రసన్నం చేసుకునేందుకు తెగ పొగిడేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు టీజర్‌ రిలీజై రికార్డుల దుమ్ముదులుపుతోంది. దీంతో ఆ టీజర్‌పై మెగాస్టార్ చిరంజీవి సహా అందరూ తమ విషెస్ తెలియజేశారు.

కానీ ఒక్కరు తప్ప..ఆ ఒక్కరు ఎవరో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆయనో ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..గత కొద్దికాలంగా పవన్‌కళ్యాణ్‌కి అల్లు అర్జున్‌కి మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే..బన్నీ నోటి వెంట వచ్చిన "చెప్పను బ్రదర్" అన్న మాట ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటి నుంచి ఏ వేదిక మీద పవన్ అన్న పదాన్ని పలకడం లేదు అల్లు అర్జున్..ఇప్పుడు కాటమరాయుడు టీజర్‌ విషయంలోనూ అదే ప్లాన్‌ని ఫాలో అవుతున్నాడని...అందుకే ఫ్యామిలీ అంతా అభినందనలు తెలిపినప్పటికీ బన్నీ మాత్రం ఆ వూసే ఎత్తడం లేదంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.