English | Telugu
సమంత, కాజల్.. గొడవ పడ్డారా??
Updated : May 9, 2016
రెండు కొప్పులు ఒక్కచోట ఇమడవు.. అంటుంటారు. ఇద్దరు కథానాయికల్ని ఓ చోట చేర్చారంటే యుద్ధమే! నువ్వెక్కువ, నేనెక్కువ అంటూ డిష్యూం డిష్యూం ఆట ఆడుకొంటారు. అయితే ఈతరం కథానాయికలు మరీ అంత చీప్ గా బిహేవ్ చేయడం లేదు. కలసి మెలసి హీరోయిన్ పాత్రని పంచుకొంటున్నారు. కానీ... సమంత, కాజల్ మధ్య మాత్రం అలాంటి స్నేహం లేదట. వీళ్లిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని... నువ్వా, నేనా?? అంటూ పోట్లాడుకొంటున్నారని టాక్. వీళ్లిద్దరూ కలసి నటించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ఇటీవల ఆడియో ఫంక్షన్ కూడా జరిగింది. ఆడియో వేడుకలో ఒకరినొకరు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. ఒకరికొరరు ఎదురుపడినా.. కనీసం మాట్లాడుకోలేదు. సెట్లో కూడా ఇంతేనట... ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారట. వీళ్లిద్దరినీ కలపడానికి చిత్రబృందం ఎన్ని ప్రయత్నాలు చేసినా... సఫలం కాలేదట.
అయితే వీళ్లిద్దరి గొడవ ఇప్పటిది కాదు.. ఇద్దరూ కలసి బృందావనం సినిమాలో నటించారు. అప్పటి నుంచీ సమంత, కాజల్ ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తూనేఉందని, అది ఇప్పటికీ కొనసాగుతోందని టాక్. మరి ఈ ముద్దుగుమ్మలిద్దరూ ఏ విషయంలో గొడవ పడ్డారో, ఎందుకు పెంచి పెద్దది చేసుకొంటున్నారో వాళ్లకే తెలియాలి. సమంత, కాజల్‌ల గొడవ బ్రహ్మోత్సవం చిత్రబృందానికి తలనొప్పి వ్యవహారంగా తయారైంది. ఈసినిమాలోని కథానాయికలు ముగ్గురితో కలసి ప్రమోషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తే అయితే సమంత, లేదంటే కాజల్ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. మరి.. వీరిద్దరి మధ్య గ్యాప్‌ని ఫిల్ చేసేదెవరో,..?? ఈ గొడవలు ఎంతకాలమో???