English | Telugu
ఆ సీన్లు వుంటే చేయదట
Updated : Feb 12, 2015
బాలీవుడ్లో మరో మంచి అకాశం కోసం కాజల్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. ఈమధ్య అలాంటి ఆఫర్ కూడా వచ్చింది. కానీ కాజల్ వదులుకొంది. ఎంత పారితోషికం ఇస్తామన్నా... మొహమాటపడకుండా `నో` చెప్పేసిందట. కారణం.. అందులో లిప్లాక్లూ.. ఘాటైన బెడ్రూమ్ సన్నివేశాలు ఉండడమేనట. ఇటీవల సుధీర్ మిశ్రా అనే ఓ బాలీవుడ్ దర్శకుడు కాజల్ ని వెదుక్కొంటూ వచ్చి ఓ కథ చెప్పాడట. కథ బాగానే ఉందిగానీ.. అందులో అడల్ట్ సీన్స్ మరీ మితిమీరిపోయాయట. అవన్నీ కట్ చేస్తే.. ఈ సినిమాలో నటిస్తా అని షరతులు పెట్టింది కాజల్. కానీ సుధీర్ మిశ్రా అందుకు ఒప్పుకోలేదట. దాంతో ఈ సినిమాని వదులుకొంది కాజల్.