English | Telugu

ఎన్టీఆర్ పారితోషికంలో భారీ కోత‌??

ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే ఈసినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. డిసెంబ‌రు నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. ఈసినిమాకి సంబంధించి ఓ హాట్ న్యూస్ టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అందేంటంటే... ఎన్టీఆర్ ఈ సినిమా కోసం త‌న పారితోషికాన్ని బాగా త‌గ్గించుకొన్నాడ‌ట‌.

`కొర‌టాల‌తో సినిమా చేయ‌డ‌మే ముఖ్యం.. పైగా నాణ్యమైన సినిమా రావాలి. నా పారితోషికంలో కోత విధించినా ఫ‌ర్వాలేదు` అంటూ మైత్రీ మూవీస్‌కి ఎన్టీఆర్ భారీ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. నిజానికి శ్రీ‌మంతుడు త‌ర‌వాత కొర‌టాల శివ మ‌రో క‌థానాయ‌కుడితో సినిమా చేయాలి. అయితే.. ఎన్టీఆర్ ఇచ్చిన ఆఫ‌ర్ మైత్రీ మూవీస్ కి బాగా న‌చ్చింద‌ట‌.

`ఎన్టీఆర్‌కు త‌గ్గించిన పారితోషికం నీకు ఇస్తాం..` అంటూకొర‌టాల‌ని ఒప్పించార‌ట‌. ఎన్టీఆర్ పారితోషికం త‌గ్గించుకోవ‌డం వ‌ల్లే.. ఈసినిమాకి కొర‌టాల శివ‌కు రూ.10 కోట్లు ఇవ్వ‌గ‌లిగార‌ని స‌మాచారం. ఫామ్‌లో ఉన్న ద‌ర్శ‌కుడ్ని ప‌ట్టుకోవ‌డానికి ఎన్ని త్యాగాలైనా చేస్తారు మ‌న హీరోలు..!