English | Telugu

హ‌న్సికకి ఈ సారి ఆ ఛాన్స్ లేన‌ట్టే!

మంచు విష్ణు, రామ్‌, సిద్ధార్ధ్‌.. ఇలా ఎంతో మంది హీరోల‌తో రెండేసి సార్లు జోడీక‌ట్టి మెప్పించింది క్యూట్‌బ్యూటీ హ‌న్సిక‌. అయితే.. త‌న ఫ‌స్ట్ హీరో అల్లు అర్జున్‌తో మాత్రం అలా సిల్వ‌ర్‌స్క్రీన్‌పై సంద‌డి చేయ‌లేక‌పోయింది ఈ పాల‌బుగ్గ‌ల సుంద‌రి. ఇప్పుడు ఆ ఛాన్స్‌నీ హ‌న్సిక‌ త‌న వ‌శం చేసుకుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న కొత్త చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ఓ నాయిక‌గా హ‌న్సిక ఎంపికైంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్‌. విశేష‌మేమిటంటే.. దేశ‌ముదురు కోసం బ‌న్ని ప‌క్క‌న సోలో హీరోయిన్‌గా క‌నువిందు చేసిన ఈ బొద్దుగుమ్మ‌.. రెండోసారి మాత్రం ఆ ఛాన్స్‌ని మిస్స‌యి మ‌రో హీరోయిన్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.